RRR: ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్. అందుకు కారణం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమానే. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు జతగా కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆలియా కనిపించేది కొద్దిసేపే అయినా చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు. ఇక ఇటీవల ”గంగుబాయి కతియావాడి” సినిమాలో వచ్చి హిట్ అందుకుంది ఆలియా.
ఈ సినిమాను తెలుగులో గంగూబాయిగా డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రేజ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎంట్రీ ఇస్తోన్న ఆలియాకు బాగా ప్లస్ అయిద్ని. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమురం భీం పాత్రలో నటించాడు. ఈ నెలలో 25వ తేదీన ఈ సినిమాను భారి స్థాయిలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో రాజమౌళి బృందం భారీగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
RRR: జక్కన్న టీమ్ సైలెంట్‌గా ఆలియాను అవైడ్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
అయితే, మొదటిసారి డిసెంబర్లో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో ఆలియా బాగా సందడి చేసింది. రాజమౌళి, చరణ్, తారక్‌లతో కలిసి ముంబై, బెంగుళూరు, చెన్నై సహా హైదరాబాద్‌లలో నిర్వహించిన ప్రమోషన్స్‌కు హాజరై బాగా సహాయపడింది. కానీ, అప్పుడు వాయిదా పడి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కానున్న నేపథ్యం లో మళ్ళీ ప్రమోషన్స్‌కు ఆలియాను పిలిస్తే ఆమె వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నా కూడా నెపొటిజం పేరుతో బాగా ట్రోల్ అవడంతో పాటు ఇటీవల వచ్చిన గంగూబాయి సినిమాతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ ఎఫెక్ట్ ఎక్కడ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపై పడుతుందో అని జక్కన్న టీమ్ సైలెంట్‌గా ఆలియాను అవైడ్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!