సినిమా

Sai Pallavi: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సాయి ప‌ల్ల‌వి.. అందుకే అలా చేస్తుందా?

Share

Sai Pallavi: ప్ర‌ముఖ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. `ప్రేమమ్` సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ‌.. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన `ఫిదా` మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. 2017లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాదు సాయి ప‌ల్ల‌వికి యూత్‌లో సూప‌ర్ క్రేజ్ ద‌క్కేలా చేసింది.

ఫిదా త‌ర్వాత వ‌రుస పెట్టిన సినిమాలు చేసిన సాయి ప‌ల్ల‌వి.. అన‌తి కాలంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. చివ‌రిగా ఈ భామ `ల‌వ్ స్టోరీ`, `శ్యామ్ సింగ‌రాయ్‌` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఈమె న‌టించిన `విరాట పర్వం` ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా రిలీజ్‌కు మాత్రం నోచుకోవ‌డం లేదు.

Baseless Rumors on Actress Sai Pallavi

ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజుల నుంచీ సాయి ప‌ల్ల‌వి కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ ఒప్పుకోలేదు. రెండు భారీ విజయాల తర్వాత కూడా సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేయ‌కుండా ఇంత సైలెంట్ గా ఉండటం ఆమె అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఓ కొత్త ప్ర‌చారం మొద‌లైంది.

సాయి ప‌ల్ల‌వి పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ని, అందుకే కొత్త సినిమాలేమి ఒప్పుకోవ‌డం లేద‌ని ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయినా.. ఇదే నిజ‌మ‌ని న‌మ్ముతున్నారు. మ‌రి ఇది నిజ‌మా..? కాదా..? అన్న‌ది తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.


Share

Related posts

Balakrishna: అనిల్ రావిపూడి పై కంటే అతనిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్న బాలయ్య బాబు..??

sekhar

Dhivya Dhuraisamy Latest Stills

Gallery Desk

Komalee Prasad White saree Pictures

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar