న్యూస్ సినిమా

Samantha – Thamannah: సమంతలో సగం క్రేజ్ కూడా తమన్నాకి దక్కలేదు..ఇదిగో ప్రూఫ్..

Share

Samantha – Thamannah: సమంతలో సగం క్రేజ్ కూడా మిల్కీ బ్యూటీకి దక్కలేదా అంటే..నిర్మొహమాటంగా దక్కలేదనే అంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోయిన్స్. ఇంకా చెప్పా లంటే సమంత కంటే తమన్నా ఇండస్ట్రీలోకి ముందు ఎంట్రీ ఇచ్చింది. తమన్నా ఖాతాలో బోలెడు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మెగాస్టార్ లాంటి వారి సరసన కూడా నటించింది. ఇంకా సమంతకు ఆ అవకాశం దక్కలేదు. మరి సమంతలో సగం క్రేజ్ దక్కనిది ఎక్కడా ఏ
విషయం లో అంటే ఐటెం సాంగ్స్ విషయంలో. ఇప్పుడు మన స్టార్ హీరోయిన్స్ అందరూ వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు.

is samantha-dominating thamannah in item songs
is samantha-dominating thamannah in item songs

డేట్స్ ఖాళీ లేకపోయినా కూడా మన దర్శక, నిర్మాతలు ఎలాగోలా ఓ మూడు రోజులు మ్యానేజ్ చేసి డేట్స్ లాక్ చేసుకుంటున్నారు. అవసరానికి మించి రెమ్యునరేషన్ ఇచ్చి కాజల్, తమన్నా, సమంత, శృతి హాసన్, పూజా హెగ్డే లాంటి వారితో ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఆగడు సినిమాలో శృతి హాసన్, రంగ స్థలం సినిమాలో పూజా హెగ్డే.. జై లవ కుశ, సరిలేరు నీకెవ్వరు, తాజాగా వచ్చిన గని సినిమాలలో మిల్కీ బ్యూటీ ఐటెం సాంగ్స్ చేసింది.

Samantha – Thamannah: ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు.

చెప్పాలంటే అందరికంటే తమన్నా ఎక్కువ ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. అయితే, గత ఏడాది పుష్ప సినిమాలో సమంత మొదటిసారి ఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్ చేసి భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. యూట్యూబ్‌లో కూడా సమంత పాటకు ఊహించని రీతిలో వ్యూస్ వచ్చాయి. అయితే, తాజాగా వచ్చిన గని సినిమాలో తమన్నా చేసిన కోడ్తే సాంగ్ సమంత చేసిన ఊ అంటావా మావా సాంగ్ ముందు తేలిపోయింది. కనీసం ఈ సాంగ్ సమంత సాంగ్‌కు దక్కినంతలో సగం కూడా వ్యూస్ రాలేదు. అసలు ఈ పాట ఉందా అంటే చాలా మంది సందేహంగా చూస్తున్నారు. అందుకే, సమంత సాంగ్‌తో తమన్నా సాంగ్‌ను పోల్చి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా చేసిన పాటలన్నిటికంటే సమంత చేసిన ఒక్క పాట ఇప్పుడు హైలెట్‌గా నిలిచింది.


Share

Related posts

టిడిపిలో ఆ ‘రాజు’గారి పరిస్థితి అంత తీసికట్టుగా ఉందా??

Yandamuri

ఏపి గృహ నిర్మాణ శాఖ పై సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma

ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకు రూ.40 వేలు ఆదాయం.. అదిరిపోయే ఆఫర్!

Teja