Hero Ram: `ఇస్మార్ట్ శంకర్` మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. మిక్స్డ్ లాక్ సొంతం చేసుకున్నా..బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రస్తుతం రామ్ `ది వారియర్` అనే సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించబోతున్నాడు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో రామ్ మతిమరుపు వ్యాధితో బాధపడతాడట. అయితే మతిమరుపుతో రామ్ చేసే కొన్ని కొన్ని పొరపాట్లు ఫుల్ ఫన్ను క్రియేట్ చేస్తాయట. రామ్ పాత్ర ఓవైపు పవర్ ఫుల్‌గా, మరోవైపు ఫుల్ ఫన్నీగా ఉంటుందట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
కాగా, కెరీర్లోనే ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు రామ్. ఈ సినిమా కోసం ఆయన కండలు తిరిగిన దేహంతో సూపర్‌గా మేకోవర్ అయ్యారు. మరోవైపు లింగుస్వామి డైరెక్ట్ చేస్తోన్న స్ట్రయిట్ తెలుగు మూవీ ఇది. కథ, కథనం పరుగులు పెట్టిస్తూ సినిమాలు తీయడంలో లింగుస్వామి మహా దిట్ట. ఈ నేపథ్యంలోనే ది వారియర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.