Samantha: సమంతతో సైన్ చేయించడానికి మాటల మాంత్రీకుడు ఇంత ట్రై చేస్తున్నాడా..!

Share

Samantha: సమంతతో సైన్ చేయించడానికి మాటల మాంత్రీకుడు ఇంత ట్రై చేస్తున్నాడా..! ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే నెటిజన్స్ కొందరు ఇదే చర్చించుకుంటున్నారట. త్రివిక్రం ఎప్పుడు తన కంఫర్ట్ చూసుకుంటారు. తన దర్శకత్వంలో నటించిన హీరోయిన్‌తో మంచి బాండింగ్ ఏర్పరచుకొని లక్కీ హీరోయిన్‌గా భావిస్తుంటారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరోయిన్‌ను తన సినిమాలలో రిపీట్ చేస్తూ ఉంటారు. అందుకే త్రివిక్రం సినిమాలలో ఎక్కువ మంది హీరోయిన్స్ కనిపించరు. ఇప్పటి వరకు ఆయన ఎక్కువగా రిపీట్ చేసింది ఇలియానా, సమంత, పూజా హెగ్డే.

is trivikram waiting for samantha dates

వీరిని తన సినిమాలలో బాగా చూపించడమే కాదు మంచి క్రేజ్ కూడా తీసుకొచ్చి పెట్టారు. అందుకే వీరంతా త్రివిక్రం సినిమా అంటే చాలు రెడీ అయిపోతారు. ప్రస్తుతం పూజా హెగ్డే అంటే బాగా ఆసక్తి చూపిస్తున్నారు త్రివిక్రం. అల వైకుంఠపురములో, అంతక ముందు అరవింద సమేత చిత్రాలలో పూజాను తీసుకున్న త్రివిక్రం బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ ఇచ్చాడు. అంతేకాదు పూజాకు ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కూడా త్రివిక్రం ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. అందుకే ఆయన కొత్తగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోయే సినిమాకు కూడా పూజా హెగ్డేనే తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

Samantha: పూజా హెగ్డే కాకుండా సమంతను తీసుకోవాలని ఆలోచనలో పడ్డారట.

అయితే ఈ మధ్య మళ్ళీ త్రివిక్రం పూజా హెగ్డే కాకుండా సమంతను తీసుకోవాలని ఆలోచనలో పడ్డారట. చాలా వరకు మళ్ళీ మహేశ్ – త్రివిక్రం సినిమాలో సమంతనే ఫైనల్ అయిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉంది. అంతేకాదు ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టింది. అందుకే ఎలాగైనా తన సినిమాలో సమంతను లాక్ చేయడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మహేశ్ సినిమాలో సమంత ఫైనల్ అయితే మాత్రం టాలీవుడ్‌లో సమంతకు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Recent Posts

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

17 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

47 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

4 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

4 hours ago