Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా త్వరలో ఓ పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నాడా..? అంటే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో అవుననే మాట వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన మాసీవ్ ఎంటర్టైనర్ పుష్ప పార్ట్1తో పాన్ ఇండియన్ స్టార్‌గా మారాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ సినిమాతో పాటు తరువాతి చిత్రాలను పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇటీవల వచ్చిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ తోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు.
ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇదే రూట్లో అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా గని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమైంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో వరుణ్‌కు హిట్ పడిందని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. బాక్సర్‌గా వరుణ్ అద్భుతంగా నటించాడని అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Varun Tej: సోనీ కంపెనీ వారితో భారీ ఢీల్..?
అయితే, ఇకపై వరుణ్ పాన్ ఇండియన్ సినిమాలను కూడా చేసేందుకు ప్లాన్ చేసుకుంటుం డగా బాలీవుడ్ అగ్ర నిర్మాత సంస్థ అయిన సోనీ కంపెనీ వారు తనతో ఓ భారీ ఢీల్ కుదుర్చు కున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన భారీ అమౌంట్ కూడా అడ్వాన్స్‌గా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి వరుణ్ తేజ్ హిందీలో చేయబోతున్న స్ట్రైట్ సినిమానా లేక పాన్ ఇండియన్ సినిమానా అనేది అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు గానీ, సోనీ వారితో
మాత్రం వరుణ్ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సైన్ చేసినట్టు సమాచారం.