న్యూస్ సినిమా

Vijay Devarakonda: ఒకే జోనర్ కథలతో రిస్క్ చేస్తున్నాడా..?

Share

Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఒకే జోనర్ కథలతో రిస్క్ చేస్తున్నాడా అంటే..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త సర్క్యూలేట్ అవుతోంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పటి వరకు హిట్స్ ఎన్ని వచ్చాయో ఫ్లాప్స్ కూడా అన్నే వచ్చాయి. అయినా అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి రెండు డిఫరెంట్ జోనర్ చిత్రాలు విజయ్ క్రేజ్‌ను చెక్కు చెదరకుండా అలానే కాపాడుతున్నాయి. ఇక ఇలాంటి హీరో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే ఆ అంచనాలు వేరే లెవల్‌లో ఉంటాయి.

is vijay-devarakonda-doing risk with same zoner story
is vijay-devarakonda-doing risk with same zoner story

ఇప్పుడు రూపొందుతున్న లైగర్, జనగణమన చిత్రాల విషయంలో అదే అంచనాలు న్నాయి. పూరి – విజయ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ రెండు సినిమాలలో ఒకటి ఈ సంవత్సరం, ఒకటి వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. అయితే, జనగణమన దేశ భక్తి ప్రధానంగా సాగే సినిమా. ఇప్పటికే ఈ కథను ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేయగా ఫైనల్‌గా విజయ్‌తో సెట్ అయింది. భారీ స్థాయిలోనే ఈ సినిమాను పూరి రూపొందిస్తు న్నాడు. అయితే, నిన్నుకోరి..మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda: ఇదే జోనర్‌లో వచ్చిన సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు.

ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో లాంఛ్ చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌గా సమంత నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. కశ్మీర్ నేపథ్యంలో దేశభక్తి – ప్రేమకథ ప్రధానాంశాలుగా ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించనున్నారట. అయితే, ఇలా బ్యాక్ టు బ్యాక్ దేశభక్తి కథలతో సినిమాలు చేస్తే విజయ్‌కు హిట్స్ దక్కుతాయా అనే సందేహాలు కొందరిలో కలుగుతున్నాయి. పైగా మన సౌత్ భాషలలో ఇదే జోనర్‌లో వచ్చిన సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు. చూడాలి మరి విజయ్ సక్సెస్ సాధిస్తాడేమో.


Share

Related posts

మహేష్ స్క్రిప్టుతో పవన్ సినిమా..??

sekhar

Ananya Nagalla: న‌డుమందాల‌తో సెగ‌లు రేపిన `వ‌కీల్ సాబ్` బ్యూటీ.. వామ్మో మ‌రీ ఇంత అరాచ‌క‌మా..?!

kavya N

ఫోటో న్యూస్ : విజయవాడ లో భార్య తో దిల్ రాజు…!

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar