RRR: ప్రపంచ దేశాలలో అత్యంత పవర్ ఫుల్ దేశాలజాబితాలో ఇజ్రాయేల్ ఒకటి. కనీసం తెలంగాణలో సగం కూడా ఉండని ఈ దేశం.. చుట్టు ప్రక్కల దాదాపు 10 అరబ్ కంట్రీ లకు దడ దడ లాడిస్తుంటది. ప్రపంచ పెద్దన్న అమెరికా కూడా ఈ దేశం విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తుంటుంది. అటువంటి ఈ దేశానికి ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన దేశం ఇండియా. పాకిస్తాన్ ఇండియా కార్గిల్ యుద్ధం విషయంలో భారత దేశం గెలవడంలో ఇజ్రాయేల్ కీలక పాత్ర పోషించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదంతా పక్కన పెడితే అటువంటి ఈ ఇజ్రాయిల్ దేశంలో రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన ఆర్టికల్ ఫుల్ పేజ్ లో రాయటం జరిగింది. “RRR” లో ఎన్టీఆర్ చేసిన కొమరం భీమ్ పాత్రనీ హైలెట్ చేస్తూ.. ఇజ్రాయిల్ ప్రముఖ మ్యాగజైన్ ఎన్టీఆర్ నటన పై.. ఫుల్ పేజి ఆర్టికల్ రాయడం జరిగింది. రామ్ చరణ్ పాత్ర రామ రాజు గురించి కొద్దిగా మాత్రమే.. రాసిన గాని ఎన్టీఆర్ పాత్ర కొమరం భీమ్ నీ ప్రశంసిస్తూ ఆ మ్యాగ్ జైన్ ఆర్టికల్ రాయడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ క్లిపింగ్ నీ వైరల్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న “RRR” హిందీ వర్షన్ లో ఉంది. కింద సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో ఉండటంతో వాటిని ఇజ్రాయేలు సినీ ఆడియన్స్ అర్థం చేసుకుని.. తారక్ పాత్ర కి బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో మనోడు పై ఏకంగా మ్యాగజైన్ లో ఆర్టికల్ రావటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. RRR సామాన్యుల మొదలుకొని సెలబ్రెటీలను బాగా ఆకట్టుకుంది ఇటీవలే హాలీవుడ్ స్టార్ దర్శకులు పొగడ్తల వర్షం కురిపించారు ఇప్పుడు ఏకంగా ఇజ్రాయేల్ మ్యాగజైన్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.