Bheemla nayak: కరోనా థర్డ్ వేవ్ అనేది లేకపోయి ఉంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలయ్యేది. భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలన్ని థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. కానీ గత పరిస్థితులే మళ్ళీ పునరావృతం అయితే ఒకే ఒక్క రోజులో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఫిక్షనల్ డ్రామా కోసం ఆల్రెడీ మహేశ్ బాబు సర్కారు వారి పాట, ఎఫ్ 3 సహా మరికొన్ని ఈ సంక్రాంతికి పోటీ లేకుండా ప్లాన్ చేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం రిలీజ్ మాత్రం తప్పనిసరిగా ఉంటుందని నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు.
అయితే ఇండస్ట్రి పెద్దలందరు కలిసి ఆర్ఆర్ఆర్ మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా ప్రభావం పడుతుందని ఆయనను తన ‘భీమ్లా నాయక్’ను పోస్ట్ పోన్ చేసుకోమని రిక్వెస్ట్ చేశారు. ఎట్టకేలకు వారి కోరిక మేరకు ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరి 25కు డేట్ మార్చుకున్నారు. కానీ వారం ముందే పండగ వాతావరణాన్ని తీసుకురావాలని బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్ఠించాలని ప్లాన్ చేసిన మేకర్స్‌కు ఒమైక్రాన్ గట్టి షాకిచ్చింది.
Bheemla nayak: మళ్ళీ ‘భీమ్లా నాయక్’ లైన్లోకి వస్తాడని టాక్ మొదలైంది.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7న రిలీజ్ కావాల్సి ఉండగా పెరుగుతున్న కేసులను దృష్ఠిలో పెట్టుకొని ఎక్కడికక్కడ కర్ఫ్యూలు, లాక్ డౌన్లు విధిస్తుండటంతో తీవ్ర చర్చల అనంతరం ‘ఆర్ ఆర్ ఆర్’ ను పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దాంతో మళ్ళీ ‘భీమ్లా నాయక్’ లైన్లోకి వస్తాడని ముందు అనుకున్న సంక్రాంతి రేస్‌లో జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తారని టాక్ మొదలైంది. అయితే అది జరిగే పని కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే 40 రోజుల వరకు రీ షూట్ చేయాల్సి
వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. ఇంకా కొంత షూట్ బ్యాలెన్స్ ఉందట. ఇక పవన్ విదేశాలలో ఉన్నారు. ఇవన్నీ దృష్ఠిలో పెట్టుకొనే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి రావడం అసాధ్యం అంటున్నారు.