Sekhar Kammula : సారంగదరియా లిరికల్ కంటే ఇది పది రెట్లు బాగుంటుంది: శేఖర్ కమ్ముల

It is ten times better than Sarangadaria Lyrical: Shekhar Kammula
Share

Sekhar Kammula: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమా “లవ్ స్టోరీ”. ఈ ఇద్దరు జంటగా ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గత నెల 27న విడుదలైన సారంగదరియా పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ పాట విడుదలైన నెల రోజులకి 100 మిలియన్ పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. తెలంగాణ జానపదానికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ జోడించగా, మంగ్లీ ఈ పాట ఎంతో అద్భుతంగా పాడింది.

It is ten times better than Sarangadaria Lyrical: Shekhar Kammula
It is ten times better than Sarangadaria Lyrical: Shekhar Kammula

ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఈ పాటను ఈ సినిమాలో జోడించాలని ఎప్పటినుంచో భావించాను. అయితే ఈ పాట సుద్దాల అశోక్ తేజ గారు కొద్దిగా లిరిక్స్ మార్చి ఎంతో అద్భుతంగా రూపుదిద్దారు. అదేవిధంగా మంగ్లీ పాడిన ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాయి పల్లవి చేసిన డాన్స్ ఈ పాటను మరో ఎత్తుకు తీసుకెళ్ళింది. ప్రస్తుతం విడుదలైన లిరికల్ పాట కంటే పూర్తి వీడియో సాంగ్ మరెంతోమందిని ఆకట్టుకుంటుందని, వీడియో పాట మరిన్ని ఎక్కువ వ్యూస్ సాధిస్తుందని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

సారంగదరియా, సాయి పల్లవి:
సాయిపల్లవి విషయానికి వస్తే ఆమెకు కథ నచ్చితేనే ఎలాంటి సినిమాలో అయినా నటించడానికి ఒప్పుకుంటారు. ఒకవేళ ఆమెకు కథ నచ్చకపోతే స్టార్ హీరో అయినా ఆ సినిమాను రిజెక్ట్ చేస్తారు.ఇక డాన్స్ విషయానికి వస్తే సాయి పల్లవి తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారని ఇదివరకే రుజువైంది. ఫిదా సినిమాలో వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే అనే పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలో సాయిపల్లవి సారంగదరియా లిరికల్ కన్నా పూర్తి వీడియో పాట పదిరెట్లు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.ఓ వైపు మంచి సాంగ్స్ మరో వైపు సాయి పల్లవి, చైతన్యల రొమాన్స్ మరోవైపు శేఖర్ కమ్ముల టేకింగ్ ఇవన్ని కలిసి సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చిత్రబృందం భావిస్తున్నారు. ఎంతో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా భారీ ధరకు ఆహా దక్కించుకున్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

పూరి నెక్ట్స్ మూవీ విజయ్‌తోనే

Siva Prasad

Kajal : మరో సీనియర్ హీరో ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్న కాజల్..??

sekhar

పవన్ కళ్యాణ్ నిర్మాతలకి రాజకీయాలకి మధ్య ఉన్న సంబంధం ఇదే ..ఇన్నాళ్ళు దాచిన సీక్రెట్ బయటపడింది ..!

GRK