NewsOrbit
Entertainment News సినిమా

Chalaki Chanti: గుండెపోటుకు గురై హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయిన జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి..!!

Share

Chalaki Chanti: జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి అందరికీ సుపరిచితుడే. జబర్దస్త్ కామెడీ షో లో ఎన్నో వైవిధ్యమైన స్కిట్స్ చేసి ఎంతోమందిని నవ్వించడం జరిగింది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది. చలాకీ చంటి స్కిట్స్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. యూట్యూబ్ లో కూడా రికార్డ్ స్థాయి వ్యూస్ వస్తాయి. ఈ పరిణామంతో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా చలాకి చంటి చోటు సంపాదించాడు. కానీ చివరిదాకా గేమ్ లో రాణించలేకపోయాడు. మధ్యలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే బయటకు వచ్చాక యధావిధిగా తన షోస్ తో అలరించే చలాకి చంటి ఇటీవల గత కొన్ని వారాల నుండి పెద్దగా కనబడటం లేదు.

Jabardast comedian Chalaki Chanti in the hospital between death

దీంతో చంటి హాస్పిటల్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఏ కారణం చేత అన్నది ఎవరికీ తెలీదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కమెడియన్ చంటి గుండెపోటుకు గురవడం జరిగిందంట. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు కేర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందట. వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు రక్తనాళాలలో.. పూడికలు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో స్టంట్ వేయడం జరిగింది. ప్రస్తుతం చలాకి చంటి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి. చలాకీ చంటికి స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ కారణంగానే గుండెపోటుకు గురైనట్లు సమాచారం.

Jabardast comedian Chalaki Chanti in the hospital between death

ఇటీవల చాలామంది గుండెపోటు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది. స్కూల్ పిల్లల సైతం గుండెపోటుకు గురవుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత మనిషి శరీరంలో చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో చాలామంది గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే చలాకి చంటి కి గుండెపోటు రావడంతో జబర్దస్త్ టీం మొత్తం హాస్పిటల్ కి వచ్చి కండిషన్ తెలుసుకున్నట్లు సమాచారం.


Share

Related posts

రామ్ చరణ్ కోరిక తీరాలంటే ఇదే చివరి అవకాశం.. లేదంటే జన్మలో జరగదు !

Naina

Sreekaram : ప్రీ బిజినెస్ తో రికార్డులకు “శ్రీకారం” చుట్టిన శర్వానంద్..! రేపే విడుదలకు సిద్ధం..!!

bharani jella

Sreeja Konidela: నా జీవితంలో ప్రముఖమైన వ్యక్తితో కొత్త ప్రయాణం అంటూ చిరంజీవి కూతురు శ్రీజ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

sekhar