Jabardasth Comedians : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్స్ లేడీ గెటప్ లో అందరిని ఎంతో ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల లేడీ గెటప్ లో ఉన్న జబర్దస్త్ కమెడియన్ లను చూసి నిజంగానే అమ్మాయిలని మోస పోయారట.చివరికి వారు అమ్మాయిలు కాదు అమ్మాయి గెటప్ లో ఉన్న అబ్బాయిలు అని తెలియగానే ఎంతో షాక్ కి గురయ్యారు.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నారప్ప” ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఇద్దరు లేడీ గెటప్ లో ఉన్న కమెడియన్స్ ని చూసిన దర్శకుడు శేఖర్ మాస్టర్ తో అక్కడేఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారయ్య అన్నారు.అయితే శేఖర్ మాస్టర్ పలుసార్లు జబర్దస్త్ కామెడీ షో కు జడ్జిగా వ్యవహరించడం వల్ల అయ్యో సార్.. వాళ్లు అమ్మాయిలు కాదు అమ్మాయిల వేషంలో ఉన్న అబ్బాయిలు అంటూ జబర్దస్త్ కమెడియన్స్ గురించి తెలియజేశారు. కావాలంటే జబర్దస్త్ సెట్ కి పదండి చూపిస్తానంటూ అక్కడికి వెళ్లారు.
సాధారణంగా జబర్దస్త్ కామెడీ షో లు ఇద్దరు ఎప్పుడూ లేడీ గెటప్ లో కనిపించి అందరినీ కనువిందు చేస్తుంటారు.జబర్దస్త్ సెట్ కి వెళ్లి వారి కామెడీలను చూసిన శేఖర్ మాస్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎంతో ఎంజాయ్ చేశారు. అయితే వారి స్కిట్ అయిపోయిన తర్వాత శేఖర్ మాస్టర్ అసలు విషయం తెలియజేస్తూ ఆ ఇద్దరు కమెడియన్స్ ను అమ్మాయిలు అనుకున్నారని శేఖర్ మాస్టర్ తెలియజేయడంతో వెంటనే శ్రీకాంత్ అడ్డాల నేను వారిద్దరి కోసమే వచ్చానని అనుకుంటున్నారనీ చమత్కరించారు. ఎంతో అందంగా తయారైనా ఆ అమ్మాయిలు, అబ్బాయిలని తెలియగానే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొంతవరకు షాక్ కి గురైన సంఘటన చోటు చేసుకుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!