Jabardasth Aadi: ఒంగోలు జిల్లా మల్లాపల్ల గ్రామంలో హైపర్ ఆది జన్మించాడు. ఇతనికి ఇద్దరు అన్నలు.. తల్లి, తండ్రి పొలం పనులు .. ఆదికి ఏదో ఒకటి చేసి మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆసక్తి ఎక్కువగా ఉండేది. అయితే ఇతను స్కూల్ సమయంలోనే డైరెక్టర్లను ఇమిటేట్ చేసేవాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారిలా మాట్లాడి పేరడీ చేసేవాడు. అదే సమయంలో 2013లో జబర్దస్త్ మొదలవడంతో స్కిట్ ప్రకారం షో ఉండడంతో ఆదిని బాగా ఆకర్షించింది. బీటెక్ అయిపోయిన తర్వాత అతను జాబ్ లో చేరాడు. కానీ అతని ఆసక్తి అంతా సినిమాలు మరియు జబర్దస్త్ మీదే ఉండేది.

హైపర్ ఆది, బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ టీవీ తెరపైకి దూసుకొచ్చారు. జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. జబర్దస్త్ లో హైపర్ ఆది కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ లో కేవలం పంచులతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య.. ప్రస్తుతం సినిమాలలో కూడా ఆది తన టాలెంట్ నీ చూపిస్తున్నాడు. అయితే హైపర్ ఆది కి జబర్దస్త్ బాగా కలిసి వచ్చింది.
ఈ మధ్యకాలంలోనే హైపర్ ఆది తన ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. ఊర్లో ఆయనకున్న ఆస్తుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఆది చదువుకునేటప్పుడు చాలా ఖర్చులు అయ్యాయని, అప్పట్లోనే రూ.20 లక్షల వరకు అప్పు అయిందని గుర్తు చేసుకున్నాడు. గతంలో తాము అప్పులు కట్టడానికి ఉన్న మూడు ఎకరాలు కూడా అమ్మేశాడట ఆది వాళ్ళ నాన్న.. అయితే జబర్దస్త్ కి వచ్చిన తర్వాత అదే ఊరిలో మళ్లీ ఏకంగా 16 ఎకరాలు కొన్నాడట మన హైపర్ ఆది. అంతేకాకుండా తండ్రి చేతికి పదివేళ్ళకు 10 ఉంగరాలు కూడా చేయించాడు. అలాగే హైదరాబాదులోనూ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు.