Jacqueline Fernandez : శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్ కొలంబోలో జన్మించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2006లో శ్రీలంక మాజీ మిస్ యూనివర్స్ అందాల పోటీలు మొదటి స్థానం దక్కించుకొని మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. శ్రీలంకలో జన్మించిన జాక్వెలిన్ ప్రస్తుతం ముంబై ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.సాధారణంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ముంబైలో బీ టౌన్ లో అందమైన ప్లాట్ కొని అక్కడ నివసిస్తుంటారు. ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అందచందాలతో బాలీవుడ్ సినిమాని ఒక ఊపు ఊపుతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ‘అలాదిన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘కిక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో జాక్వెలిన్ ఇండస్ట్రీలో వెనుదిరిగి చూసుకోలేదు. అదేవిధంగా ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో బ్యాడ్ బాయ్ అనే ఐటమ్ సాంగ్ లో పలకరించింది.ఇండస్ట్రీలో ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న జాక్వెలిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.ఇండస్ట్రీలో కోట్లు సంపాదిస్తున్న జాక్వెలిన్ ప్రస్తుతం ముంబైలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు అనే విషయం మీకు తెలుసా? ప్రస్తుతం జాక్వెలిన్ బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
జాక్వెలిన్ ప్రియాంక చోప్రా ఇంట్లో అద్దెకు ఉండడానికి గల కారణం ఇదే:
జాక్వెలిన్ ప్రస్తుతం ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ అపార్ట్ మెంట్ లో నాలుగు, ఐదు అంతస్తులను జాక్వెలిన్ మూడేళ్లకు లీజుకు తీసుకుందట. అంతేకాదు ఈ ఫ్లాట్స్‌కు సంబంధించి ప్రతినెలా జాక్వెలిన్ ప్రియాంక చోప్రాకు రూ.6.78 లక్షల రూపాయలను అద్దె చెల్లిస్తున్నారు. కోట్లకు సంపాదిస్తున్న జాక్వెలిన్ కు సొంత ఇంటిని కొనుక్కొనే స్తోమత ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రా ఇంట్లో ఉండటానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఈ బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇంట్లో అద్దెకు ఉన్నప్పటి నుంచి ఈమెకు ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించడానికి వరుస అవకాశాలు వచ్చాయి.దీంతో ప్రియాంక ఇల్లు తనకు బాగా కలిసి వచ్చిందనే నమ్మకంతో సొంత ఇంటిని కొనుక్కోకుండా అదే ఇంటిలో నెలకు లక్షలలో రూపాయలు అద్దె చెల్లిస్తూ నివసిస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!