Jagapathi Babu: హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 60 సంవత్సరాలు వయసు పైగా ఉన్న జగపతిబాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో వందకు పైగా చిత్రాలు నటించి ఏడు నంది అవార్డులను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించి చాలామంది మహిళా అభిమాన లోకాన్ని సంపాదించారు. ఆయన తీసిన గాయం, అంతపురం, అడవిలో అభిమన్యుడు, శ్రీకారం, మావిచిగురు, శుభలగ్నం, శుభాకాంక్షలు, మనోహరం, హనుమాన్ జంక్షన్, పెళ్లయిన కొత్తలో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించిన శుభలగ్నం సినిమా జగపతిబాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ నీ ఎక్కువ తీసుకురావడం జరిగింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు నటించిన లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో సినిమాలు మరింతగా పేరు తీసుకొచ్చాయి.
చాలా సినిమాలలో ప్రజెంట్ విలన్ పాత్రలో నటిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇలా ఉంటే జగపతిబాబుకి దాదాపు 30 సంవత్సరాల నుండి అనేక చోట్ల అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సొంత అభిమానులకు అనేక సేవా కార్యక్రమాలు చేయటం మాత్రమే కాక వారి కుటుంబాలను ఆర్థికంగా కూడా జగపతిబాబు పైకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి జగపతిబాబు ఇప్పుడు అభిమానుల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకనుండి తనకి అభిమాన సంఘాలు లేవని.. సేవా కార్యక్రమాలు కూడా తాను దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లాగ నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్య కారణంగా భావించాను.
అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని, వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి.. వాళ్లు నాకు తోడుగా ఉంటే.. నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ కంటే ఆశించటం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా.. బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.. జీవించండి, జీవించనివ్వండి’’ అంటూ జగపతిబాబు.. అభిమానులకు ఓ సందేశాన్ని పంపించారు. దీంతో జగపతి అభిమాన సంఘాల నాయకులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. జగపతిబాబు ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం పట్ల కొంతమంది ఫీల్ అవుతున్నారు.