ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ శుక్రవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం .. రిచర్డ్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!