NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: “పుష్ప 2” లో తన పాత్ర పై జగపతిబాబు కీలక వ్యాఖ్యలు..!!

Share

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప 2” కోసం దేశం మాత్రమే కాదు ప్రపంచంలో మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. “పుష్ప” మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో… రెండో భాగం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేయటం జరిగింది. సినిమాలో లుక్.. అల్లు అర్జున్ మేనరిజం.. మరియు ఫైర్ మొదటి భాగంలో కంటే మరింతగా డబుల్ డోస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా “పుష్ప 2” గురించి జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jagapathi Babu's key comments on his role in Pushpa 2

ఈ సినిమాలో తాను చాలెంజింగ్ రోల్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. సుకుమార్ తనకి అద్భుతమైన పాత్ర “పుష్ప 2″లో కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. సుకుమార్ తో పనిచేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. “కీసి కా భాయ్ కీసీ కా జాన్” మీడియా సమావేశంలో జగపతిబాబు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా “కీసి కా భాయ్ కీసీ కా జాన్” రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు పాల్గొని పుష్ప సినిమా పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు వెంకటేష్ కూడా నటించడం జరిగింది.

Jagapathi Babu's key comments on his role in Pushpa 2

హీరోయిన్ గా పూజ హెగ్డే కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం పుష్ప సినిమా రెండో భాగం ఒడిశా అడవులలో షూటింగ్ జరుపుకుంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి మొదటి భాగం కంటే మరిన్ని ఎక్కువ భాషల్లో పుష్ప రెండో భాగం… విడుదల చేయబోతున్నట్లు సమాచారం. గతంలో సుకుమార్ దర్శకత్వంలో జగపతిబాబు నటించిన రంగస్థలం, నాన్నకు ప్రేమతో రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రెండిటిలో కూడా విలనిజం అద్భుతంగా చూపించడం జరిగింది. ఈ క్రమంలో పుష్ప లో జగపతిబాబుకి ఏ రకమైన పాత్ర సుకుమార్ కేటాయించాడు అన్నది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

Ramya Krishna: రమ్య కృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి వెనుక ఉన్న కన్నీటి కథ తెలుసా??

Naina

`ఒకే ఒక జీవితం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్ బాగున్నా ఇలా వ‌చ్చాయేంటి?

kavya N

ముగిసిన `వాల్మీకి` టైటిల్ వివాదం.. టైటిల్ మార్పు

Siva Prasad