SSMB28: సీనియర్ హీరో జగపతిబాబు గత కొద్ది సంవత్సరాలు నుండి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 90లలో హీరోగా క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ కలిగిన జగపతిబాబు… సంవత్సరానికి రెండు మూడు సినిమాలతో అలరించేవాడు. ప్రారంభంలో ఫ్యామిలీ ఆడియన్స్ నీ అలరించి తర్వాత మాస్ సినిమాలు చేయడం జరిగింది. మధ్యలో వరుస పెట్టి ఫ్లాపులు పలకరించడంతో… కొంతకాలం బ్రేక్ తీసుకొని.. మళ్లీ విలన్ పాత్రలు చేసి ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక సినిమాలలో నటిస్తూ ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన “లెజెండ్”, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన “రంగస్థలం” సినిమాల ద్వారా ఎంతో అలరించడం జరిగింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ”లో కూడా ప్రతి నాయకుడు పాత్రలో జగపతిబాబు నటించారు. కాగా ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో అవకాశం అందుకోవటం జరిగింది. విషయంలోకి వెళ్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని జగపతిబాబు తాజాగా స్పష్టం చేశారు. “అరవింద సమేత వీర రాఘవ” కంటే ఇంకా భయంకరంగా ఈ సినిమాలో పాత్ర ఉంటుంది అని పేర్కొనటం జరిగింది. త్రివిక్రమ్ ఈసారి చాలా వైల్డ్ క్యారెక్టర్ ఇచ్చాడు. కచ్చితంగా ప్రేక్షకులను తన పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది అని జగపతిబాబు స్పష్టం చేశారు.
అంతకుముందు మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాలో జగపతిబాబు తండ్రి పాత్రలో నటించడం జరిగింది. కాగా ఇప్పుడు విలన్ పాత్రలో చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు శ్రీ లీల కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 28వ తారీకు రిలీజ్ కావలసి ఉండగా… సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాక తల్లి ఇంద్ర దేవి మరణించటం తర్వాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో… మహేష్ ఎంతో తల్లడిల్లిపోయాడు. ఈ ఏడాది జనవరి నెల నుండి ఆగిపోయిన షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యి ప్రస్తుతం నిరంతరంగా కొనసాగుతూ ఉంది. మే 31 కృష్ణా పుట్టినరోజు నేపథ్యంలో సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.