25.7 C
Hyderabad
April 1, 2023
NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ని అధికారికంగా కన్ఫామ్ చేసిన సినిమా యూనిట్..!!

Share

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకోవడం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ సినిమా రంగంలోనే సంచలనంగా మారింది. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా భారతీయ చలనచిత్ర రంగంలో ₹1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో అత్యధిక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. అంతే కాదు ప్రస్తుతం ఆస్కార్ రేసులో కూడా ఉంది. ఈనెల 13వ తారీకు ఆస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అమెరికా వెళ్ళటం జరిగింది.

janhvi kapoor as heroine in ntr 30 movie official poster release

ఆల్రెడీ దర్శకుడు రాజమౌళి ఇక హీరో రామ్ చరణ్.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గత వారం నుండి అక్కడే ఉంటూ వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెల నుండి జరగనుంది. అయితే ఈరోజు ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జతగా దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.

janhvi kapoor as heroine in ntr 30 movie official poster release

హీరోయిన్ గా శ్రీదేవి దక్షిణాది సినిమా రంగంలో ఆల్మోస్ట్ ఆల్ అందరి స్టార్ హీరోలు సరసన నటించడం జరిగింది. తెలుగులో ఎన్టీఆర్ తరం మొదలుకుని చిరంజీవి తరం వరకు హీరోయిన్ గా.. వరుస అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత బోనీకపూర్ తో పెళ్లి అయ్యాక సినిమా ఇండస్ట్రీకి దూరం కావటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె కూతురు జాన్వి కపూర్ తన ఫస్ట్ సౌత్ సినిమా ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


Share

Related posts

Nagarjuna: సినిమా టికెట్ల వ్యవహారంలో ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సెటైర్లు వేసేసిన నాగార్జున..??

sekhar

Nandita Swetha Beautiful Stills

Gallery Desk

Pushpa 2: సమంతాకి బంపర్ ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్..??

sekhar