Entertainment News సినిమా

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

Share

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. “ధడక్” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది. భారతీయ చలనచిత్ర రంగంలో హీరోయిన్ శ్రీదేవి అనేక సంచలన సృష్టించింది. బాలనటిగా సినిమా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి బాలీవుడ్ మొదలుకొని దక్షిణాది వరకు చాలామంది హీరోలతో నటించింది. తెలుగులో అయితే సీనియర్ ఎన్టీఆర్ తరంతో పాటు చిరంజీవి తరం హీరోలతో జతకట్టి అనేక సినిమాలు చేయడం జరిగింది.

Janhvi Kapoor reveals mother Sridevi's reaction to movie entry..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవి నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత బాలీవుడ్ బడా నిర్మాత బోనికపూర్ నీ పెళ్లాడిన శ్రీదేవి సినిమాలకు దూరమైపోయింది. కొన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. 2018వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరణించడం జరిగింది. ఆ తర్వాత శ్రీదేవి వారసురాలిగా సినిమా ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్ విజయవంతంగా ప్రస్తుతం రాణిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లికి సినిమాలోకి ఎంట్రీ ఇస్తాను అని చెప్పితే శ్రీదేవి ఏ రియాక్షన్ ఇచ్చిందో తెలియజేసింది.

Janhvi Kapoor reveals mother Sridevi's reaction to movie entry..!!

ఇండస్ట్రీలోకి వస్తానంటే స్టార్టింగ్ లో అమ్మ వద్దని చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో అనుకున్నంత ఈజీగా ఏదీ ఉండదని వివరించింది. సక్సెస్ఫుల్ గా రాణించాలంటే కఠినంగా ఉండాలని.. కానీ నువ్వు అలాగా రాణించలేవు అని అమ్మ శ్రీదేవి చెప్పుకొచ్చింది. కానీ నేను ఇండస్ట్రీలోకి వెళ్తాను అని మొండిగా మాట్లాడటంతో.. తేల్చి చెప్పడంతో చివర ఆఖరికి అమ్మ ఒప్పుకుంది అంటూ జాన్వీ కపూర్ ఇటీవల చెప్పకు వచ్చింది. ఇదిలా ఉంటే జాన్వికపూర్ కేవలం హిందీలోనే సినిమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో త్వరలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా జాన్వి కపూర్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.


Share

Related posts

నాని `ద‌స‌రా` ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది.. ఊర‌మాస్ అంతే!

kavya N

Bheemla Nayak: భీమ్లా నాయక్ కోసం కొట్టుకుంటోన్న హాట్ స్టార్, ఆహా.. ఎంత ఆఫర్ చేశారో తెలిస్తే పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు!

Ram

ఏపీ ఏమైనా నార్త్ కొరియానా?

Siva Prasad