న్యూస్ సినిమా

Janvi kapoor: ఎన్.టి.ఆర్ అనుకున్నారు..అందరికీ ఆ స్టార్ కిడ్ షాకిచ్చి యంగ్ హీరోతో కమిటైందిగా..!

Share

Janvi kapoor: అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ధడక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ యంగ్ బ్యూటీకి బాలీవుడ్‌లో తండ్రి బోనీకపూర్, మరో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అండదండలు భారీగా ఉన్నాయి. ఈమె కమిటయ్యే సినిమాలను బోనీ, కరణ్ ఫైనల్ చేస్తున్నారు. అందుకే జాన్వీ త్వరగానే స్టార్ హీరోయిన్‌గా మారింది. హిందీలో ఆమె కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు.

janvi-kapoor tollywood project with vijay devarakonda not with ntr
janvi-kapoor tollywood project with vijay devarakonda not with ntr

ఇక జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలామంది దర్శక, నిర్మాతలు హిందీలో ఆమె డెబ్యూ సినిమా నుంచే ట్రై చేస్తున్నారు. కానీ ఎందుకో తెలుగులో సరైన ప్రాజెక్ట్ ఆమెకు పడటం లేదు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆమె డెబ్యూ ప్రాజెక్ట్ సాలీడ్‌గా ఉండాలని ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండేళ్ళుగా టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన నటించే సినిమాతో జాన్వీ డెబ్యూ మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఎన్.టి.ఆర్ 30 ఇంతకముందు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించారు. అప్పుడే ఈ ప్రాజెక్ట్‌లో జాన్వీని ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

Janvi kapoor: హీరో చేసే సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ..?

కానీ, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు వేరే దర్శకుడి చేతికి వచ్చింది. ఆయనే కొరటాల శివ. ఎన్.టి.ఆర్ 30 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుండగా, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ బావ నిర్మిస్తున్నారు. కానీ, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కాదట. ఇక జాన్వీ డెబ్యూ సినిమా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఉండబోతుందని తాజా సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ రూపొందుతోంది. దీని తర్వాత ఈ హీరో చేసే సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ..దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా అతి త్వరలో రానుందని సమాచారం.


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అదిరిపోయే గేమ్ ఆడి టాప్ ఫైవ్ లోకి మానస్..??..??

sekhar

బాబుగారి బేలతనం ఇలా బయటపడింది!

Yandamuri

మాస్కులు వద్దంటున్న అమెరికా అధ్యక్ష్యుడు..! ట్రంప్ బాధేమిటి అసలు?

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar