NewsOrbit
Entertainment News సినిమా

Jaya Janaki Nayaka: ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన “జయ జానకి నాయక”..!!

Share

Jaya Janaki Nayaka: ప్రపంచ సినిమా రంగంలో తెలుగు సినిమాలు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ఉన్నాయి. 2018లో విడుదలైన బాహుబలి పుణ్యమా.. దేశంలోనే తెలుగు సినిమా మార్కెట్ అద్భుతంగా విస్తరించింది. బాహుబలి తర్వాత పుష్ప, “RRR”, కార్తికేయ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టాయి. “RRR” ఏకంగా ఆస్కార్ గెలవడంతో.. టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది. ఇదే సమయంలో చాలామంది సినిమా ప్రేమికులు తెలుగు సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఒకప్పుడు భారతీయ చలనచిత్ర రంగం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బాలీవుడ్ గురించి మాట్లాడే పరిస్థితి ఉండేది.

Jaya Janaki Nayaka who created the world record

కానీ ఇప్పుడు రాజమౌళి పుణ్యమా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పేరు.. ప్రపంచ సినీ శిఖరాగ్రస్థాయికి చేరుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మార్కెట్ విస్తరించింది. “RRR” మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లో ముఖ్యంగా జపాన్ దేశంలో ఇప్పటికీ కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే 2017వ సంవత్సరంలో “జయ జానకి నాయక” అనే సినిమా విడుదల కావడం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలైన ఈ యాక్షన్ ప్రేమకథా చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మాస్ పల్స్ బాగా తెలిసిన స్పెషలిస్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన బోయపాటి ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాసుని అద్భుతంగా చూపించారు. కానీ  సినిమా పెద్దగా ఆడలేదు. కానీ బెల్లంకొండ సురేష్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా చూపించడం జరిగింది. అయితే తాజాగా ప్రపంచ సినిమా రంగంలో ఏ సినిమా కూడా అందుకొని ఒక అరుదైన రికార్డు “జయ జానకి నాయక” క్రియేట్ చేయడం అందుకుంది.

Jaya Janaki Nayaka who created the world record

విషయంలోకి వెళ్తే యూట్యూబ్ లో ఈ సినిమాకి సంబంధించిన హిందీ వర్షన్ నీ ఉత్తరాది ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. దీంతో “జయ జానకి నాయక” హిందీ వర్షన్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. ఇప్పటివరకు 709M వ్యూస్ రావటంతో ప్రపంచంలోనే… యూట్యూబ్ లో 709M వ్యూస్ దాటిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. “జయ జానకి నాయక” తర్వాత 702 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో “కేజిఎఫ్” ఉంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ నటించిన “చత్రపతి” సినిమాని హిందీలో బెల్లంకొండ సురేష్ హీరోగా వివి వినాయక్ దర్శకుడిగా రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పోస్టర్ రిలీజ్ కావటం జరిగింది. ఫస్ట్ టైం “చత్రపతి” రీమెక్ సినిమాతో బెల్లంకొండ సురేష్ తన అదృష్టాన్ని హిందీలో పరీక్షించుకోబోతున్నారు.


Share

Related posts

Dharsha Gupta Beautiful Looks

Gallery Desk

Jr.NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..!!

bharani jella

ఒక్క డిసెంబర్ లోనే అతను మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు..! పట్టించుకోరే…?

siddhu