28.2 C
Hyderabad
February 4, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Jayasudha: మూడో పెళ్లి అంటూ తనపై వస్తున్న వార్తలకి క్లారిటీ ఇచ్చిన జయసుధ..!!

Share

Jayasudha: సీనియర్ హీరోయిన్ జయసుధ అందరికీ సుపరిచితురాలే. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో రామారావు కాలంలో అనేక అవకాశాల అందుకున్న జయసుధ తర్వాత… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ ఉంది. హీరోల తల్లి పాత్రలో పలు సినిమాలలో నటించడం జరిగింది. రాజకీయాల్లో కూడా కీలకంగా రాణించింది. ఇటీవలే బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకి కూడా రావడం జరిగింది. ఇదిలా ఉంటే జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్దిరోజుల నుండి వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. విషయంలోకి వెళ్తే జయసుధ వెళుతున్న ప్రతి కార్యక్రమంలో ఓ వ్యక్తి.. అది కూడా విదేశీయుడు కనిపిస్తూ ఉన్నాడు.

Jayasudha gave clarity to the news about her third marriage
Jayasudha

విజయ్ నటించిన “వారసుడు” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో కూడా జయసుధ తో పాటు ఆ వ్యక్తి కూడా రావడం జరిగింది. ఈ పరిణామంతో ఆ విదేశీయుడుతో జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంత ఈ వార్తలపై తాజాగా జయసుధ స్పందించారు. తాను మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజుల నుండి వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తెలిపారు. ఇదే సమయంలో తనతో తిరుగుతున్న వ్యక్తి పేరు ఫిలిం రూయోల్స్ అని స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఆయన తన బయోపిక్ తీయడానికి ఇండియా వచ్చినట్లు ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకునేందుకు తనతో పాటు ప్రతి కార్యక్రమానికి వస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తన గురించి ఇంటర్నెట్ ద్వారా ఆయన అనేక విషయాలు తెలుసుకున్నారని.. చెప్పుకొచ్చారు.

Jayasudha gave clarity to the news about her third marriage
Jayasudha Marriage

ఇంతకుమించి ఇద్దరి మధ్య మరేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. జయసుధ కి ఇప్పటికే రెండుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే బిజినెస్ మేన్ నీ పెళ్లి చేసుకుని వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకోవడం జరిగింది. అనంతరం బాలీవుడ్ స్టార్ జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ నీ పెళ్లి చేసుకున్నారు. కుమారుడిని కూడా కన్నారు. 2017లో నితిన్ కపూర్ మరణించడం జరిగింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు తనపై వస్తున్న వార్తలకు వివరణ ఇచ్చి ఈ రీతిగా జయసుధ ఫుల్ స్టాప్ పెట్టారు.


Share

Related posts

VJ Akshaya Beautiful Saree Photos

Gallery Desk

Genelia: కొత్త హీరో సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ జెనీలియా..!!

sekhar

ఒక్క సాలిడ్ హిట్ తో రేటు పెంచాడు…

Siva Prasad