తన కుమార్తె శివాత్మిక చదువులు కొనసాగించాలని అంటున్నారు జీవిత. అది తన నిర్ణయం కాదనీ, తన భర్త నిర్ణయమనీ ఆమె చెప్పారు. తాను సినిమాల్లో కొనసాగుతున్న రోజుల్లో చదువును కొనసాగించే అవకాశం తనకు పెద్దగా రాలేదనీ, ఆ వెంటనే పెళ్లి చేసుకోవడంతో ఇక వెసులుబాటు దొరకలేదనీ అన్నారు. కానీ తన కుమార్తెలు మాత్రం తప్పకుండా చదువులు పూర్తి చేయాల్సిందేనని తన భర్త కోరిక అని తెలిపారు. జీవిత-రాజశేఖర్ పెద్ద తనయ శివానీ ఇప్పటికే ఎంబీబీయస్ చదువుతున్నారు. వారి రెండో కుమార్తె నటించిన `దొరసాని` ఇటీవల విడుదలైంది. ఇప్పటికే ఆమెకు పలువురు కథలు చెబుతున్నారు. మరి రెండో సినిమా సంగతి ఏంటి? అని శివాత్మికను ప్రశ్నిస్తే ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. `నేను నా నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా. ఎప్పుడూ బ్యాకప్ ఉండాలనేది మా నాన్న ఆశయం. అందుకే నేను వైద్య విద్యకు ప్రిపేర్ అవుతున్నాను. దొరసాని తర్వాత చాలా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను. చదువును, సినిమాలను బ్యాలన్స్ చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి మా నాన్న సినిమాల షూటింగ్లు చూస్తూ పెరిగాను. అందుకే నాకు సినిమా షూటింగ్ కొత్తగా లేదు. కానీ నేను నటించే స్థానంలో నిలబడటం మాత్రం కొత్తగానే అనిపించింది. ఈ సినిమా ఇచ్చిన అనుభవం నా తర్వాతి సినిమాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను` అని చెప్పారు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!