MAA Elections: మా ఎన్నికలు.. MAA Elections ప్రస్తుతం టాలీవుడ్ టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్. కారణం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలే. సెప్టెంబర్ లో జరగాల్సిన ఈ ఎన్నికలు మూడు నెలల ముందే టాలీవుడ్ లో సెగలు రేపింది. తాను మా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నాను అని ప్రకాశ్ రాజ్ చెప్పడమే ఇందుకు కారణం. వెంటనే మంచు విష్ణు, హేమ, జీవిత, జీవీఎల్ నరసింహారావు.. ఇలా కొందరు తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. వీరందరిలో జీవిత ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాను ఎవరి సపోర్ట్ లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా.. భర్త రాజశేఖర్ ఉదంతం తానింకా మర్చిపోలేదన్నారు. పైగా.. ప్రస్తుతం తెరపైకి వచ్చిన నాన్ లోకల్ అంశంపై కూడా మాట్లాడారు.
ఎన్నికల్లో పోటీ చేస్తే నేను ఎలాంటి ప్యానెల్ ఏర్పాటు చేయకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. అసోసియేషన్ లో గొడవలకు ఈగోలే కారణం. అందరం కలిసి కూర్చుని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. రాజశేఖర్ రాజీనామా సమయంలో మా వర్గాల తీరు నేను మర్చిపోలేదు. అందరం కూర్చుని మాట్లాడుకుందామని అనుకున్నా కుదరలేదు. రాజశేఖర్ రాజీనామా తర్వాత నేనూ ఆఫీస్ బేరర్ పదవికి రాజీనామా చేద్దామనుకున్నా. కానీ.. రాజశేఖర్ వద్దని వారించారు. కానీ.. ఆయన విషయం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. ‘మా’లో 350 మంది మహిళా సభ్యులున్నారు. ఈసారి అసోసియేషన్ కు మహిళను అధ్యక్షురాలిని చేస్తానని పెద్దలు అన్నారు. ఇందుకు సమయం వచ్చిందనే అనుకుంటున్నాను’ అని అన్నారు.
Read More: Prakash Raj: నేను నాన్ లోకలా..? ఇన్నాళ్లూ గుర్తు రాలేదా..? ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మీటింగ్ తర్వాత నరేశ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమావేశంలో జీవిత కూడా హజరవ్వాల్సింది. తానెందుకు హాజరు కాలేదో జీవిత చెప్పారు. మీడియా ముందు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఎందుకన్న నరేశ్ సలహాతోనే తాను హాజరు కాలేదని చెప్పారు. అలాగే ప్రకాశ్ రాజ్ పై నాన్ లోకల్ ముద్రపై కూడా స్పందించారు. ‘ప్రకాశ్ రాజ్ పై నాన్ లోకల్ అనే ముద్ర వేయడం నాకు నచ్చలేదు. ‘మా’లో ఎవరికీ నచ్చదు. ఎందరో కన్నడ హీరోయిన్లు తెలుగులో నటిస్తున్నారు. మా పిల్లలు తమిళంలో నటిస్తున్నారు. వీరంతా నాన్ లోకల్ అయిపోరు కదా’ అని అన్నారు. మొత్తంగా ఈసారి ‘మా’ ఎన్నిక రసవత్తరంగా జరుగబోతోందని తెలుస్తోంది.