NTR: దివంగత అందాల శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించనుంది అని ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే “కేజీఎఫ్” సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దడ దడ లాడించ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ నవంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ కానుందట. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ నీ “NTR 31” ప్రాజెక్టు కోసం ఒప్పించడం జరిగిందట. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ప్రారంభంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దీపికా పదుకొనే నీ తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వరస ప్రాజెక్టులతో దీపికా పదుకొనే బిజీగా ఉండటంతో… జాన్వీ కపూర్ నీ సంప్రదించటం జరిగిందట.
“కేజిఎఫ్” డైరెక్టర్ మరియు పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో జాన్వి కపూర్ కూడా ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్… కొరటాల శివ దర్శకత్వంలో తన కెరియర్ కి సంబంధించి 30వ సినిమా చేస్తున్నారు. వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కాగా ప్రారంభంలో కొరటాల సినిమాలో జాన్వికపూర్ నీ తీసుకుందామని ప్రయత్నాలు చేశారు గాని కుదరలేదు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు .. తారక్ సరసన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. “NTR 31” హీరోయిన్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…