Subscribe for notification
Categories: సినిమా

NTR30: ఎన్టీఆర్ కోసం మరో సంచలన హీరోయిన్ నీ తెరపైకి తీసుకొస్తున్న కొరటాల..??

Share

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా హీరో ఎన్టీఆర్ తో పాటు డైరెక్టర్ కొరటాల తీసుకోవటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా విజయం సాధించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా రాజమౌళి దర్శకత్వంలో “RRR” లాంటి పెద్ద హిట్ పడటంతో.. ఈ సినిమా ఎలాగైనా విజయం సాధించేలా స్క్రిప్ట్ విషయంలో నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళితో ఎన్టీఆర్ నటించక హిట్ పడిన తర్వాత దాదాపు కొన్ని ఫ్లాపులు తారక్ ఎదుర్కొన్న పరిస్థితులు గతంలో మనం చూశాం.

ఈ తరుణంలో అటువంటి పరిస్థితి మళ్లీ రాకూడదని తారక్ కూడా ఈ ప్రాజెక్టు పై చాలా శ్రద్ధ పెట్టడం జరిగిందట. అంతా బాగానే ఉన్నా స్క్రిప్టు మొత్తం లాక్ అయినా గాని.. సినిమాలో హీరోయిన్ విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటిలో తారక్ కి జోడీగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నీ తీసుకోవాలని భావించారు. ఆమెకు పెళ్లి కావడంతో ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగిందని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దిశా పటాని.. సాయి పల్లవి పేర్లు వినిపించాయి.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ ని కొరటాల తెరపైకి తీసుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ సినిమాల హవా కొనసాగుతూ ఉండటం తో పాటు.. బాలీవుడ్ మార్కెట్ నీ కూడా చాలావరకు టాలీవుడ్ కబ్జా చేస్తూ ఉండటం తో.. జాన్వి కపూర్ కొరటాల శివ సినిమాలో నటించడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్. పైగా “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ లో ఎన్టీఆర్ నటించడంతో జాన్వికపూర్ ఈ ప్రాజెక్టు లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share
sekhar

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

8 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

8 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

20 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago