Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు సుకుమార్ తో చేసిన ఆర్య, ఆర్య 2 సినిమాలు చాలా స్టైలిష్ గా తెరకెక్కించడం తో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మూడో సినిమా “పుష్ప” పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండటం… “రంగస్థలం” వంటి భారీ బ్లాక్ బస్టర్ తో సుకుమార్ అదే రీతిలో “అలా వైకుంఠపురం” బ్లాక్ బస్టర్ హిట్ తో అల్లు అర్జున్ ఉండటంతోపాటు పాన్ ఇండియా తరహాలో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో.. గ్యారెంటీ హిట్ అని బన్నీ అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
పైగా సినిమాలో అల్లు అర్జున్ ఎప్పుడు లేని విధంగా లారీ డ్రైవర్ పాత్రలో గంధపు చెక్కల స్మగ్లర్ గా నటించడమే కాక సరికొత్త మేక్ఓవర్ ఫుల్ జుట్టు తో పాటు గుబురు గడ్డంతో ఉండటంతో సినిమా స్టోరీ ఏంటి అన్నదానిపై మంచి ఆసక్తి సామాన్య ప్రేక్షకులలో నెలకొంది. పైగా ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అడుగుపెడుతున్న క్రమంలో.. భారీ మార్కెట్ లో పెండింగ్ వస్తాయని మొన్నటివరకు ఫిక్స్ అయిపోయిన అభిమానులకు సరికొత్త వార్త అటు బాలీవుడ్ నుండి ఇటు కోలీవుడ్ నుండి వినబడుతోంది.
మేటర్ ఏమిటంటే ఇటీవల “పుష్ప” సినిమా ఆగస్టు 13వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆగస్టు 13వ తారీకు బాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్ అబ్రహం ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ సినిమా అదే రోజు రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట ఇప్పటికే డేట్ కూడా లాక్ చేసినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల మాట. మరోపక్క కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్ “వలిమై” కూడా ఆగస్టు 13వ తారీకు రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు, దీంతో బాలీవుడ్ అదే విధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో “పుష్ప” సినిమా ఓపెనింగ్స్ కి భారీగానే గంటి పడినట్లు వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!