John Abraham: బాలీవుడ్ కండలవీరుడు స్టార్ హీరో జాన్ అబ్రహం అందరికీ సుపరిచితులే. “ధూమ్” సినిమా తో దేశ వ్యాప్తంగా తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న జాన్ అబ్రహం… బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్నాడు. అనేక మల్టీస్టారర్ సినిమాలు చేసిన జాన్ అబ్రహం ప్రస్తుతం ఎటాక్ అనే సినిమా చేయడం జరిగింది. ఏప్రిల్ మొదటి తారీకు సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో జాన్ అబ్రహం చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ అదేవిధంగా ప్రాంతీయ సినిమాలపై వైరల్ కామెంట్ చేశారు.
మూవీ ప్రమోషన్ లో… నెక్స్ట్ చేయబోయే సినిమాలకు సంబంధించి ప్రస్తావన వచ్చిన టైములో… బాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు గాని మరే ప్రాంతీయ సినిమాలు.. చేయటం లేదని క్లారిటీ ఇచ్చారు. “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో… ప్రభాస్ నటిస్తున్న “సలార్” లో నెగిటివ్ రోల్ లో చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని… ఎటువంటి తెలుగు సినిమా చేయడం లేదని నేను ఎప్పటికీ హిందీ సినిమాల్లోనే నటిస్తాను హిందీ హీరోగా కొనసాగుతాను.
ప్రాంతీయ సినిమాలు చేసే ఆలోచన లేదు. ఇతర భాషల్లో సెకండ్ హీరో… సహనటుడు పాత్రలు చేయను. ఇతర నటులు మాదిరిగా డబ్బు కోసం తెలుగు లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమాలో నటించే ప్రసక్తి లేదు అంటూ జాన్ అబ్రహం తనదైన శైలిలో కామెంట్ చేశారు. నెక్స్ట్ పటాన్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నట్లు.. ఈ సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళుతున్నట్లు స్పష్టం చేశారు.