NTR 30: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతుంది. తాజాగా మేకర్స్ నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు..

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇంకా తన సినిమాను మొదలు పెట్టలేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ తాజాగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ జూనియర్ ఎన్టీఆర్ తన రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని కనిపించాడు. 2024 ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నట్లు కూడా తెలిపారు.
అయితే దీనిపై తారక్ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశగానే ఉన్నారని చెప్పొచ్చు. వచ్చే ఏడాది విడుదల చేస్తారని తెలియడమే. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొత్తంగా తొమ్మిది భాషల్లో విడుదల చేయమన్నారు. అందులో జపనీస్ చైనా భాషలు కూడా ఉన్నాయి.