Jr NTR Classical dance : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటన ద్వారా అందరినీ ఆకట్టుకున్న హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. కేవలం నటన మాత్రమే కాకుండా అదిరిపోయే స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎన్టీఆర్ కు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉండడంతో తన తల్లి శాలిని ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ లో శిక్షణ ఇప్పించింది.చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అనుభవంతోనే ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో డాన్సులు ఇరగ తీస్తుంటాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ లలో ఈ యంగ్ టైగర్ ఒకరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎంతో కష్టమైన స్టెప్పులను సైతం ఎంతో సునాయాసంగా చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.
ఎన్టీఆర్ డాన్స్ పట్ల బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఓ సందర్భంలో కొనియాడారు.చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ శిక్షణ తీసుకోవడంతో పాటు స్టేజ్ ప్రదర్శనలను కూడా చేసి ఎన్నో అవార్డులను సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ పర్ఫామెన్స్ చేసిన వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి, ఎంతోమంది డాన్స్ ప్రేమికులతో పాటు, ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంది.
బాల రామాయణం కంటే ముందుగా:
క్లాసికల్ డాన్స్ లో శిక్షణ తీసుకున్న ఎన్టీఆర్ పలు స్టేజ్ ప్రదర్శనలు చేసేవాడు. ఇందులో భాగంగానే ఈ నాట్యానికి అవార్డును సైతం దక్కించుకున్నాడు. అదేవిధంగా బాల రామాయణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. అయితే ఈ డాన్స్ బాల రామాయణం సినిమా కంటే ముందుగా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. బాల రామాయణం సినిమా తర్వాత మూడు సంవత్సరాలకు ఎన్టీఆర్ “నిన్ను చూడాలని” అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆది, సింహాద్రి వంటి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ విధంగా తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.