న్యూస్ సినిమా

ఆ బాలీవుడ్ యంగ్ హీరోయిన్‌తో యాక్ట్ చేయనున్న తారక్..?

Share

కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది. అయితే ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీనే కావాలని ఎన్టీఆర్ పటుపట్టి కూర్చున్నాడు. కానీ ఆ అమ్మడు వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటంతో NTR 30 మూవీ కోసం డేట్స్ ఇవ్వలేకపోతోంది.

హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ఎంపిక

#image_title

దాంతో సెకండ్ ఆప్షన్ గా అలియా భట్ ని కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారు. అలియా కూడా మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఆమె డేట్స్ ని క్యాన్సల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన NTR30 లో కనిపించబోతుందనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఎన్టీఆర్ సరసన నటించబోతుంది అనే టాక్ వినబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కూడా జాన్వీ కపూర్ ని ఈ సినిమాలో ఫిమేల్ లోడ్ తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే

#image_title

NTR30 సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్‌లను కొరటాల శివ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు అని తెలుస్తుంది. అంతా ఓకే అయితే అక్టోబర్ 5 దసరా పండుగ రోజున పూజ చేసి NTR30 సినిమా షూటింగ్ ని సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఇక తారక్ ఈ సినిమా షూటింగ్ లో బిజీ అవుతాడు. ఈ సినిమా హిట్ కావడంతో తారక్‌కి తప్పనిసరిగా మారింది రాజమౌళి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా కచ్చితంగా ఫెయిల్ అవుతుంది అనే సెంటిమెంట్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.


Share

Related posts

Breaking: హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత .. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పోలీసుల మోహరింపు

somaraju sharma

వికేంద్రీకరణ సమర్థిస్తూ రావులపాలెంలో ర్యాలీ

somaraju sharma

Congress: కాంగ్రెస్ బాగుప‌డాలంటే ఉన్న ఏకైక ఆప్ష‌న్ ఏంటంటే…

sridhar