Bangarraju teaser: జూనియర్ ‘బంగార్రాజు’ వచ్చేసాడు.. అదిరిపోయిన టీజర్!

Share

Bangarraju teaser: అక్కినేని వారసులు, తండ్రీ కొడుకులు అయినటువంటి నాగార్జున – నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న తాజా చిత్రం ”బంగార్రాజు”. గతంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ పేరుతో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. అందుకే ఇపుడు తాజాగా దానికి సీక్విల్ గా ”బంగార్రాజు” పేరుతో వస్తోంది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతూకు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

guppedentha manasu: రిషిపై ఒక రేంజ్ లో ఫైర్ అయిన మహేంద్ర…. మరోపక్క రిషి ప్రేమను డిస్టర్బ్ చేస్తున్న గౌతమ్..!!
టీజర్ ఎలా ఉందంటే?

ఇక ఈసారి కూడా సంక్రాంతి సెటిమెంట్ ని నమ్ముకొని బంగార్రాజు బరిలో దిగుతున్నాడు. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా తాజాగా ”బంగార్రాజు” టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఇందులో బంగార్రాజు మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈసారి తన మనమడు చిన బంగార్రాజు సమస్య పరిష్కారానికి బంగార్రాజు భూమ్మీదకు వచ్చినట్లు కనబడుతోంది. ఫ్యామిలీలో ఏదో సమస్య తలెత్తగా.. దాని పరిష్కారం కోసం బంగార్రాజు కిందికి వచ్చినట్టు టీజర్ లో చూపించారు.

Samantha: వామ్మో సమంత! న్యూ ఇయర్ రోజే నాగార్జున + నాగ చైతన్యకి పంచ్ వేసిందిగా!
టీజర్లోని మిగిలిన అంశాలివే..

‘ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే!’ అని రమ్యకృష్ణను నాగార్జున ఆటపట్టించడం భలే సూపర్ గా వుంది. ఇందులో యాక్షన్ బాగానే ఉన్నట్టుంది. నాగ్ – చైతూ కలసి యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ కూడా బాగానే వుంది. విజువల్స్ బావున్నాయి. సత్యానంద్ స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి ఇరగదీసారు. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ కట్స్ అదుర్స్.


Share

Related posts

విజయ్ కి ఏమయ్యింది…?

somaraju sharma

Salaar: ‘సలార్‌’లో మరో బాలీవుడ్ బ్యూటీ..!

GRK

Pragya Jaiswal Green India Challenge Pics

Gallery Desk