NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: పార్టీ లేదా “పుష్ప” అంటూ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ పై కామెంట్స్..!!

Share

Pushpa 2: ఏప్రిల్ 8వ తారీకు ఐకాన్ స్టార్ బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున పోస్టులు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఒకరోజు ముందుగానే “పుష్ప 2” స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం తెలిసిందే. ఈ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ ట్రెండింగ్ గా నిలిచింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేయడంతో బయటకు వచ్చి బన్నీ అభిమానులను పలకరించడం జరిగింది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ తెలియజేయడం జరిగింది.

Junior NTR comments on Allu Arjun saying Party or Pushpa

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ…పుష్ప ది రూల్ స్పెషల్ వీడియో అదిరిపోయింది.. ఆల్ ది బెస్ట్ అని పోస్ట్ పెట్టడం జరిగింది. చిరంజీవితో పాటు సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, డైరెక్టర్ మారుతి, హరిష్ శంకర్, కోన వెంకట్, మంచు లక్ష్మి ఇంకా సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది విషెస్ తెలియజేశారు. సాయంత్రం 7:00కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో “వెరీ హ్యాపీ బర్తడే బావ. ఈరోజు బాగా ఎంజాయ్ చెయ్” అని శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి బన్నీ థాంక్యూ బావ రిప్లై ఇచ్చారు. క్రమంలో పార్టీ లేదా పుష్ప అంటూ… ఎన్టీఆర్ తనదైన శైలిలో మళ్లీ రిప్లై ఇవ్వడం జరిగింది.

Junior NTR comments on Allu Arjun saying Party or Pushpa

“పుష్ప” సినిమాలో డైలాగు ఎన్టీఆర్ చెప్పడంతో.. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. సరిగ్గా అల్లు అర్జున్ జన్మదినానికి ముందు పుష్ప సెకండ్ పార్ట్ స్పెషల్ వీడియో విడుదల చేయటంతో దేశవ్యాప్తంగా పుష్పమయం అయింది. మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ కానిపిస్తుంది. అమ్మవారు లుక్ లో బన్నీ ఫోటోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. పుష్ప ది రూల్…సెకండ్ పార్ట్ స్పెషల్ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేయడం జరిగింది.


Share

Related posts

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మేకర్స్ సంచలన నిర్ణయం.. టిక్కెట్ల రేట్లు పెంచడం లేదట!

Ram

‘తలపతి 65’ చిత్రం.. దర్శకుడు ఎవరో తెలుసా!

Teja

Acharya : ఆచార్య లో చిరు లుక్ ఇలా ఉంటుందా..!!

bharani jella