బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్ మధ్య పచ్చ గడ్డివేస్తే బగ్గుమనేంత దూరం ఉండేది. ఒకరి గురించి ఒకరు బయట కూడా మాట్లాడుకోని పరిస్థితి ఉండేది, అయితే హరికృష్ణ మరణం వీళ్లని కలిపిందని, ఇక బాబాయ్-అబ్బాయి మధ్య ఎలాంటి గొడవలు లేవని అందరూ అనుకున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ అంతా కలిసిపోయారు అనుకుంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
బాలకృష్ణకి మొదటి నుంచీ దూరంగా ఉండే ఎన్టీఆర్, తాత కథతో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని బాలయ్య ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని పట్టించుకోని ఎన్టీఆర్, తన అన్న కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా విడుదలైన మొదటి రోజే… ”ఈ సినిమా చూశాను చాలా బాగుందని, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం అవుతుందని, అందరూ 118 సినిమా” చూడాలని కోరాడు. అన్న సినిమా కోసం వెంటనే స్పందించిన ఎన్టీఆర్, బాబాయ్ మూవీని పట్టించుకోకపోవడం చూస్తుంటే తారక్ కావాలనే బాలయ్యని సైడ్ చేసినట్లున్నాడని క్లియర్ గా తెలుస్తోంది. తారక్ ప్రవర్తన చూసిన వాళ్లు మాత్రం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నందమూరి హీరోల మధ్య గ్యాప్ రావడం, ఎన్టీఆర్ బాబాయినే పక్కన పెట్టడం చూస్తుంటే మరోసారి నందమూరి అభిమానుల్లో చీలిక వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
previous post
next post