ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం సమయంలో అందరిని పిలిచిన బాలయ్య తారక్‌ని మాత్రం ఇన్వైట్ చేయలేదు. ఈ సినిమా చాలా మంది నటి నటులను తీసుకున్న ఎన్టీఆర్ మాత్రం తీసుకోలేదు. దూరంగా ఉన్న వీళ్ల బంధం కాస్త హరికృష్ణ మరణంతో కాస్త దగ్గరైయింది..దీంతో అరవింద సమేత సక్సెస్ మీట్‌కు బాబాయ్ బాలయ్యనే ఇన్వైట్ చేశాడు తారక్. ఇక ఇటీవలే జరిగిన ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్‌ని ఇన్వైట్ చేశాడు బాలయ్య. అయితే వీళ్లు బంధం గట్టిపడుతుందని అనుకుంటున్న టైంలోనే మళ్లీ కొత్త రూమర్స్ సర్కూట్ అవుతున్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో.
తాజా రిలీజై విమర్శకులతో పాటు, స్టార్స్ హీరోలు , సినీ వర్గాల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ సినిమాని గురించి తారక్ ఏం మాట్లాడకపోడంతో కొత్త అనుమానాలకు దారి తీస్తుంది. మా తాత గురించి మీ తాత సినిమా తీశాడు అని తమ పిల్లకు చూపిస్తానని చెప్పిన తారక్ ఎన్టీఆర్ సినిమా గురించి ఎలాంటి ట్విట్ చేయకపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నిన్నటి వరకు బాగానే ఉన్న బాలయ్య, తారక్ మధ్య మళ్ళీ దూరం పెరిగిందా అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా వర్క్ షాప్ కోసం ఫారెన్ వెళ్లాడట తారక్. అందుకే ఎన్టీఆర్ సినిమాని చూడలేకపోయడని తెలుస్తోంది. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయిన ఆర్ఆర్ఆర్లో మొదట తారక్ సంబంధించిన కొన్ని సీన్స్‌ని చిత్రకరించబోతున్నాడట రాజమౌళి. దాని కోసమే బిజీగా ఉన్నాడ తారక్. అంతే తప్ప బాలయ్య , తారక్ మధ్య ఎలాంటి విబేధాలు రాలేదంటున్నారు నందమూరికి ఫ్యామిలి సన్నిహితులు. మరి తాత బయోపిక్ తారక్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.