ఇప్పటి వరకూ టెలివిజన్ చరిత్రలోనే రియాల్టీ గెమ్ షోల్లో బాగా పాపులర్ గేమ్ షో బిగ్ బాస్. ఫారెన్ నుంచి వచ్చిన ఈ రియాల్టీ షోకు ఇండియా వైడ్ గా యమ క్రేజ్ ఏర్పడింది. తెలుగులో ఈ షో ఫస్ట్ సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేశాడు. ఓ స్టార్ హీరో ఈ రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహారించడంతో బిగ్ బాస్‌కు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ గేమ్ షోని చూడానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు టీవిలకు అంటుకుపోవడంతో, ఫస్ట్ సీజన్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీఆర్పీల్లోనే కొత్త చరిత్ర సృష్టించిన బిగ్ బాస్ సీజన్ 1, సెకండ్ సీజన్ పై అంచనాలని తారాస్థాయికి పెంచడంలో చాలా ఉపయోగ పడింది.
కాస్త మాసాల ఎక్కువ అంటూ వచ్చిన బిగ్ బాస్ సీజన్ టూకి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహారించాడు. అయితే సీజన్ వన్ తో పోల్చుకుంటే సీజన్ టులో నాని యాంకరింగ్ పై చాలాసార్లు ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ షో ఎక్కువ రోజలు ఉండడం, కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మాత్రమే ఉండడం మరిన్ని విమర్శలకు దారితీసింది. సీజన్ 2లా నెగెటివ్ ఫీలింగ్స్ ని రిపీట్ కాకుండా ఉండేలా బిగ్ బాస్ సీజన్ త్రీని హోస్ట్ దగ్గర నుంచి కంటెస్టెంట్స్ వరకు పక్కా ప్లాన్‌తో స్టార్ మా నిర్వహించబోతున్నారు. కొద్ది నెలల్లో స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్‌కి హోస్ట్‌గా మొదటి సీజన్ కి తన హోస్టింగ్ తో సూపర్ హిట్ చేసిన ఎన్టీఆర్ అయితే బాగుంటుందని స్టార్ మా భావిస్తోందట. సెలెక్ట్ చేయబోయే కంటెస్టెంట్స్ అంతా యూత్ కనుక వాళ్ల ఎనర్జీకి తారక్ కూడా తోడైతే షో మరో రేంజ్ కి వెళ్తుందని ఆలోచించిన షో మేకర్స్, ఎన్టీఆర్ ని అప్రోచ్ అయ్యారట. తారక్ షో చెయ్యడానికి జక్కన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు, ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా మెప్పించడానికి రెడీ అయినట్లే.