కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సినీ ఇండస్ట్రీలో ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి రేర్ కాంబినేషన్ హీరో కార్తి, హీరోయిన్ జ్యోతికది. హీరో సూర్య తమ్ముడు కార్తి.. సూర్య భార్య జ్యోతిక. ఇప్పుడు వదిన, మరిది కలిసి ఒకే పనిచేయబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. వదిన, మరిది కలిసి తెరపై నటించడం ఇంతకు ముందు పొగరు
` సినిమాలో చూసుండొచ్చు. ఆ సినిమాలో శ్రియారెడ్డి, విశాల్ కలిసి నటించారు. అయితే అప్పటికింకా విశాల్ అన్నను శ్రియా రెడ్డి పెళ్లి చేసుకోలేదు. అయితే ఇలాంటి వదిన, మరిది కాంబినేషన్ ఇదే తొలిసారి అవుతుందనడంలో సందేహం లేదు. `దృశ్యం` సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అంతా ఓకే అవగానే సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!