`కె.జి.య‌ఫ్ 2` షురూ


ఒక సినిమా రంగానికి ఒక సినిమా ఓ ట‌ర్నింగ్ పాయింట్‌లా క‌న‌ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు తెలుగు చిత్ర సీమ‌లో చూస్తే నిన్న శివ‌.. రీసెంట్‌గా బాహుబ‌లి సినిమాలు సినిమా రేంజ్‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. అలాగే క‌న్న‌డ చిత్ర‌సీమ రేంజ్‌ను మార్కెట్ ప‌రంగా మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లిన సినిమా కె.జి.య‌ఫ్‌… య‌ష్ హీరోగా.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. అప్ప‌టి వ‌ర‌కు 50 కోట్ల క్ల‌బ్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైన క‌న్న‌డ చిత్ర‌సీమ ఏకంగా 200 కోట్ల క్ల‌బ్‌కు చేరింది. అది కూడా కె.జియ‌ష్ తొలి భాగం వ‌ర‌కు మాత్ర‌మే. ఇప్పుడు కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2 రూపొందాల్సి ఉంది. కె.జి.య‌ఫ్ పార్ట్ 2లో మిగిలిన భాగానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ నేడు మొద‌లైంది. బెంగ‌ళూరు కోదండ రామ ఆల‌యంలో సినిమా యూనిట్ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది. బాలీవుడ్ నటుడు ప‌ర్హాన్ అక్త‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.క‌న్న‌డ‌తో పాటు సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది.