`దేవత` చిత్రంలో శోభన్‌బాబు, శ్రీదేవిలపై చిత్రీకరించిన `ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా…` సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పాటను వరుణ్‌తేజ్ `వాల్మీకి` సినిమా కోసం రీమేక్ చేశారు. అప్పటి సాంగ్ తరహాలోనే బిందెలతోనే ఈ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. ఈ పాట వీడియో ప్రోమోను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఈ చిత్ర యూనిట్ నన్ను ఇరవై అయిదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. ఈ పాట చూస్తుంటే మళ్లీ నాకు ఆరోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ పాట తీసేముందు లొకేషన్స్ చూడటానికి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ ఉండ్రాజవరం అనే ఊళ్లో మా ఫ్రెండ్ డాబా మీద మడత మంచం మీద పడుకొని ఈ పాట ఎలా తీయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఊరంతా ఠంగ్ ఠంగ్‌మని సౌండ్స్ వస్తున్నాయి. ఏమిటా సౌండ్ అని అడగగా.. ఇక్కడ బిందెలు తయారు చేస్తారు అని చెప్పారు. వెంటనే చాలా బిందెలుంటాయా అని అడిగాను. ప్రొడ్యూసర్స్ బాగుండాలని బిందెలు కొనేబదులు అద్దెకి ఇస్తారేమో అడుగు.. అన్నాను. వారు ఒప్పుకొని పాట షూట్ చేసేటప్పటికి 1000 బిందెలు రెడీ చేసి ఇచ్చారు. ఈ సినిమా రివ్యూ రాస్తూ ఒక విలేకరి ‘సినిమా అంతా బావుంది కానీ.. పాట వచ్చేటప్పటికి 1000 బిందెలు ఎట్లా వస్తాయో దర్శకుడికే తెలియాలి’ అని రాశారు. తర్వాత నేనతన్ని కలిసినప్పుడు.. నువ్వుగానీ, మీ ఫ్రెండ్స్‌గానీ ఎవర్నైనా లవ్ చేశారా అంటే.. చేశారండీ అన్నారు. వాళ్లెప్పుడైనా డ్యూయెట్ పాడటం చూశావా? డ్యూయెట్ ఒప్పుకుంటే.. బిందెలు కూడా ఒప్పుకోవాలి అన్నాను.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!