మంచు విష్ణు కి గత కొంతకాలంగా హిట్స్ దక్కడం లేదు. తను నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్నఈ యంగ్ హీరో ఒక వినూత్నమైన కథ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం భారి రిస్క్ చేస్తున్నాడు. మోసగాళ్ళు అన్న టైటిల్ తో టాలీవుడ్ తో పాటు ఏకంగా హాలీవుడ్ లోను ఈ సినిమాని రూపొందిస్తుండం విశేషం.
మంచు విష్ణు నిర్మాతగా 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తున్నాడు. ఇక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌లో జోనరలో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లాక్ డౌన్ కి ముందే ఒక భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. విదేశాల్లో షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారని తాజా సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాలలో చిత్రీకరణ అంటే పెద్ద రిస్క్ అని అంటున్నారు. ఈ విషయంలో త్వరలోనే క్లారిటి రానుంది.
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి, రుహానీ సింగ్‌లు, నవదీప్, నవీన్ చంద్ర.. కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈరోజు కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ కాజల్ కి సర్ప్రైజ్ ఇస్తూ సినిమాలో తన లుక్ ని రివీల్ చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాజల్ మంచు విష్ణు కి సిస్టర్ గా మోసగాళ్ళు సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి ల ఆచార్య, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ భారతీయుడు 2 ఒక బాలీవుడ్ సినిమాలోను హీరోయిన్ గా నటిస్తుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!