Samantha – Kajal Agarwal: ఒక హీరోయిన్ చేయాల్సిన సినిమా మరో హీరోయిన్ చేతికి వెళ్ళడం అనేది అన్నీ సినిమా ఇండస్ట్రీలలో సర్వ సాధారణంగా జరిగే విషయాలే. హీరోల విషయంలో కూడా అంతే. ఒక దర్శకుడు ఎవరో ఒక హీరోను మైండ్‌లో పెట్టుకొని కథ రాసుకుంటే అది సెట్స్ మీదకు అదే హీరోతో రావచ్చు..లేదా మరో హీరో చేతికి ఆ ప్రాజెక్ట్ వెళ్ళవచ్చు. ఇలా మారడానికి ప్రధానంగా కారణం చేతి నిండా సినిమాలు ఉండి డేట్స్ సర్దుబాటు కాకపోవడం అయితే, దీనితో పాటు రెమ్యునరేషన్ సహా పలు కారణాలుంటాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక హీరో ఓ సినిమాను వదులుకుందీ అంటే, అందులో ప్రధానంగా డేట్స్ సమస్య అయితే, కథలో పాత్రకు ఇంపార్టెంట్ లేకపోవడం, ఓవర్ ఎక్స్‌ఫోజింగ్, రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ ఉండటం లాంటి ఇతర కారణాల వల్ల కూడా కొందరు హీరోయిన్స్ మంచి కథలను వదులుకుంటున్నారు. అలాంటి కథలతో సినిమా చేసి క్రేజీ హీరోయిన్గా మారిన వారూ ఉన్నారు. అయితే, ఇక్కడ సమంత వదులుకుంది సినిమా కాదు. కమర్షియల్ యాడ్ ఫిలిం. అదేంటీ కమర్షియల్ యాడ్స్ అయితే సమంత అస్సలు వదలదు కదా అని అనుకుంటున్నారే మో.
Samantha – Kajal Agarwal: చైతూతో ఉంటే గ్యారెంటీగా సమంత ఈ యాడ్ వదులుకునేది కాందంటున్నారు.
అది ప్రెగ్నెన్సీ యాడ్ ఫిలిం కావడంతో సమంత వదులుకుంది. అసలే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి అనవసరమైన ట్రోల్స్ ఎదుర్కుంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ యాడ్ చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయనే ఆలోచనతోనే మంచి ఆఫర్ వచ్చిన ఈ కాంట్రాక్ట్‌ను వదులుకుం దట. అయితే, అప్పటికే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో వెంటనే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే, ఈ యాడ్ ఫిలిం నేషనల్ వైడ్‌గా ప్రసారం అవుతోంది. అదే చైతూతో ఉంటే గ్యారెంటీగా సమంత ఈ యాడ్ వదులుకునేది కాదంటున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!