చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వివరాల్లోకెళ్తే.. నటిగా పదేళ్ల అనుభం సంపాదించుకున్నప్పటికీ గ్లామర్ విషయంలోనూ కాజల్, కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడుతుంది. మంచి సినిమాలను ఎంచుకోవడంలోనూ కాజల్ అచితూచి అడుగులు వేస్తుంది. తాజా సమాచారం ప్రకారం కాజల్ వచ్చే ఏడాది హాలీవుడ్ చిత్రంలో నటించనుంది. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ఓ హాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారు. టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకు పోషించని పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనుందని సమాచారం.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!