Kajal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిన్న ముంబైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పటల్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో.. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. దీంతో అభిమానులు, సెలబ్రెటీలు కాజల్ దంపతులకు విషెస్ తెలుపుతున్నారు.
అయితే తాజాగా తమ కుమారుడికి కాజల్ దంపతులు క్యూట్ నేమ్ కూడా పెట్టేశారు. ఇంతకీ ఏం పేరు పెట్టారో తెలుసా.. `నీల్ కిచ్లూ`. అవును, కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ తనయుడి పేరును ఇన్స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేశాడు. `ఏప్రిల్ 19, 2022న నీల్ కిచ్లూ పుట్టాడనే విషయాన్ని చెప్పడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. మా మనసులు ఉప్పొంగుతున్నాయి. మాకు ప్రేమను అందించి, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు` అని గౌతమ్ తన పోస్ట్ కింద రాసుకొచ్చాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో నీల్ కిచ్లూను కాజల్ దంపతులు ఎప్పుడెప్పుడు అందరికీ చూపిస్తారా అని అభిమానులు ఎంతో ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు. 2020 అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ముంబైలో బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహాం ఘనంగా జరగగా.. గత ఏడాది కాజల్ ప్రెగ్నెంట్ అయింది.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో కాజల్ నటించిన `ఆచార్య` విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా చేశారు. ఇందులో కాజల్‌తో పాటు పూజా హెగ్డే మరో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవ ఏప్రిల్ 29 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
https://www.instagram.com/p/Ccj472RLV5D/?utm_source=ig_web_copy_link