Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దశాబ్ద కాలం పాటు సౌత్ ప్రేక్షకులు అలరించిన ఈ ముద్దుగుమ్మ.. 2020 అక్టోబర్ 30న ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసిన కాజల్.. త్వరలోనే అమ్మ కాబోతోంది. ఇటీవల కాజల్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరితోనూ షేర్ చేసుకుంది. ఇప్పటికే ఈమె బీబీ బంప్ ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. అయితే తాజాగా కాజల్ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు మరియు దగ్గర బంధువులు మాత్రమే ఈ వేడకలో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పిక్స్‌లో కాజల్ సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతోంది. దీంతో ఆమె అభిమానులు వావ్, సూపర్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈమె తెలుగులో చిరంజీవి సరసన నటించి `ఆచార్య` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే ఈ బ్యూటీ దుల్కర్ సల్మాన్‌కు జోడీగా `హే సినామిక` అనే పాన్ ఇండియా కూడా చేసింది. ఈ మూవీ మార్చి 3న రిలీజ్ కానుంది.