Kajal Aggarwal: ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ మరియు ఆమె భర్త గౌతమ్ కిచ్లూ మంగళవారం నాడు తమ బిడ్డకు స్వాగతం పలికారు. దీంతో అటు అగర్వాల్, ఇటు కిచ్లూ ఫ్యామిలీస్‌లో సెలబ్రేషన్స్ నెలకొన్నాయి. మరోవైపు ఈ గుడ్ న్యూస్ విని అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని.. మరో రెండు, మూడు రోజుల్లో హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కాజల్ దంపతులు ఇంకా అధికారికంగా తెలపకపోయినప్పటికీ.. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీంతో కాజల్ తన లిటిల్ ప్రిన్స్‌ను ఎప్పుడెప్పుడు అందరికీ పరిచయం చేస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`క్యూ….హో గయా నా` అనే హిందీ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన కాజల్.. `లక్ష్మీ కళ్యాణం`తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తనదైన అందం, అభినయం, అంతకు మించిన టాలెంట్‌తో టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2020 అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ముంబైలో బంధు మిత్రుల సమక్షంలో వీరి వివాహాం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసిన కాజల్.. గత ఏడాది తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరితోనూ పంచుకుంది.