Kajal: 2007లో విడుదలైన `లక్ష్మీ కళ్యాణం` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన అందాల భామ కాజల్ అగర్వాల్.. తనదైన అందం, అభినయం, అంతకు మించిన ట్యాలెంట్ తో టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లోనూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసనా ఆడి పాడిన ఈ చందమామ.. కరోనా లాక్ డౌన్ సమయంలో స్నేహితుడు, ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని వైభవంగా వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత కొద్ది రోజులు సినిమాలు చేసినా.. గత ఏడాది ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలె కాజల్ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కాజల్ తనయుడితో మధుర క్షణాలను ఆస్వాదిస్తోంది. అయితే కాజల్ ఇకపై సినిమాల్లో నటించదని, ఇంటికే పరిమితం కానుందని, నటనకు శాశ్వతంగా పులిస్టాప్ పెట్టేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ వార్తలు ఆమె అభిమానులను తీవ్రంగా కలవర పెట్టాయి. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదట. పైగా కాజల్ మళ్లీ నటించేందుకు రెడీ అవుతోందట. అందుకు భర్త గౌతమ్ మరియు కుటుంబ సభ్యులు సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారట. తాజాగా బయటకు వచ్చిన ఫొటో షూట్ లో కాజల్ మునుపటి లుక్ లోనే దర్శనమివ్వడంతో.. ఆమె రీ ఎంట్రీ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
అయితే ఈ సారి కమర్షియల్ చిత్రాల్లో కాకుండా ప్రయోగాత్మక సినిమాలు, వెబ్ సిరీస్ లపైనే ఫోకస్ చేయాలని కాజల్ భావిస్తుందట. ప్రస్తుతం అటువంటి కథల కోసమే ఎదురు చూస్తోందట. మరి కాజల్ ఎదురు చూపులు ఫలించేనా..? ఆమె కోరుకుంటున్న కథలు తలుపు తట్టేనా..? అన్నది చూడాలి.