Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ పెళ్లైన నాటినుండి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2020 ఏడాది అక్టోబర్ 30వ తారీఖున కాజల్… గౌతమ్ కిచ్చు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్దీ నెలల క్రితం బాబుకి కూడా జన్మనివ్వడం జరిగింది. అప్పటి నుండి దాదాపు రెండు సంవత్సరాలు పాటు సినిమాలకు దూరమైన కాజల్ అగర్వాల్ మళ్లీ ఇప్పుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “చంద్రముఖి 2” సినిమాలో నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
2005వ సంవత్సరంలో “చంద్రముఖి” రావటం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ ఇంకా చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటించడం జరిగింది. జ్యోతికకి దయ్యం పట్టడం సినిమాలో చాలా హైలెట్ గా చూపించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా “చంద్రముఖి 2” ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో “చంద్రముఖి” స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నీ దర్శకుడు పీ వాసు సెలెక్ట్ చేసినట్లు తమిళ సినిమా రంగంలో వార్తలు వస్తున్నాయి.
తొలుత ఇతర నటీమణులను తీసుకుందామనుకున్నా సినిమా యూనిట్.. ఇటీవల కాజల్ అగర్వాల్ కి స్టొరీ వినిపించడం జరిగిందంట. కథ చాలా వైవిధ్యంగా.. ఉండటంతో ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. రీ ఎంట్రీ విషయంలో ఇప్పటికే మునుపటి అందం కోసం కాజల్ భారీ వర్క్ అవుట్ లు స్టార్ట్ చేయడం జరిగింది. గుర్రపు స్వారీ…ఇంకా కత్తి యుద్ధం వంటి వంటివి చేస్తోంది. ఇంకా ఇదే సమయంలో తనకి లైఫ్ ఇచ్చిన తెలుగులో కూడా అవకాశం కోసం కాజల్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇటువంటి తరుణంలో ఒక్కపుడు సూపర్ హిట్ చంద్రముఖి సినిమా సీక్వెల్ లో అవకాశం రావడంతో కాజల్ ఒకే చెప్పినట్లు వార్తలు వైరల్ అవ్వుతున్నాయి.