Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. తన ఫామ్‌ను కోల్పోకుండా వరుస అవకాశాలను అందుకున్న కాజల్ 2020లో ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వైభవంగా వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత భార్తతో ఏకంగా నెల రోజుల పాటు మాల్దీవ్స్‌లో మస్తు ఎంజాయ్ చేసిన ఈమె.. ఆపై ఒప్పుకున్న సినిమాలన్నీ చకచకా పూర్తి చేసేసింది. ఇక ఈ ఏడాది కాజల్ తల్లి కూడా కాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా గౌతమ్ కిచ్లూ కాజల్ ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించాడు.
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటే కాజల్.. తాజాగా బ్లూ టాప్‌లో దిగిన ఓ హాట్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ సందర్భంగా `మనసు వెకేషన్ కోరుకుంటుంది` అంటూ కాజల్ రాసుకొచ్చింది. దీంతో కాజల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది.
కాగా, కాజల్ సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి సరసన ఈమె నటించిన `ఆచార్య` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అలాగే మరోవైపు హిందీలో ఒక చిత్రం, తమిళంలో మూడు చిత్రాలు కాజల్ చేస్తుండగా.. వీటి షూటింగ్స్ సైతం కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.