సినిమా

Kajal Aggarwal: కాజ‌ల్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్ త‌ట్టుకోలేరు!

Share

Kajal Aggarwal: కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల చంద‌మామ‌.. అన‌తి కాలంలో త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా గురించి సంపాదించుకుంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ న‌టించి మంచి గుర్తింపు ద‌క్కించుకున్న కాజ‌ల్.. ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను 2020 అక్టోబ‌ర్ 30న వివాహం చేసుకుంది.

పెళ్లి త‌ర్వాత కూడా ప‌లు సినిమాలు చేసిన కాజ‌ల్‌.. గ‌త ఏడాది గ‌ర్భం దాల్చ‌డంతో బ్రేక్ తీసుకుంది. కాజ‌ల్‌, గౌతమ్ దంప‌తుల‌కు కొద్ది రోజుల క్రిత‌మే పండంటి మ‌గ బిడ్డ జ‌న్మించాడు. కుమారుడికి కాజ‌ల్ దంప‌తులు `నీల్ కిచ్లూ` అని నామ‌క‌ర‌ణం కూడా చేసేశారు. ప్ర‌స్తుతం బిడ్డతో విలువైన క్ష‌ణాల‌ను గ‌డుపుతున్న కాజ‌ల్‌.. తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ట‌.

అదేంటంటే.. ఇక‌పై సినిమాల‌కు పులిస్టాప్ పెట్టేసి కుమారుడికే తన మొత్తం సమయాన్ని కేటాయించాలని కాజల్ భావిస్తోందట. సినిమాలలో నటిస్తే కొడుకుని చూసుకోవడానికి స‌రిగ్గా టైమ్ దొర‌క‌ద‌నే ఆలోచనతో కాజ‌ల్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతేకాదు, ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో కూడా చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ఈ వార్త‌లే నిజ‌మైతే.. కాజ‌ల్ ఫ్యాన్స్ అస్స‌లు త‌ట్టుకోలేరు. మ‌రి నిజంగా కాజ‌ల్ సినిమాల‌ను గుడ్‌బై చెప్ప‌నుందా..? లేదా..? అన్న‌ ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త రావాలంటే ఆమె నుంచి ప్ర‌క‌ట‌న రావాల్సిందే.


Share

Related posts

Lavanya Tripathi Beautiful Saree Photos

Gallery Desk

కరోనా నుండి కోలుకున్న ఐశ్వర్యరాయి కూతురు ఆరాధ్య .!!

sekhar

బిగ్ బాస్ 4 : ఆ కంటెస్టెంట్ జైలుకి… విజయం సాధించిన రోబో టీం?

arun kanna